A2 న్యూస్, జూన్ 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట (28) మెదక్ జిల్లా, చేగుంట మండలం, పులిమామిడి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

