Thursday, July 30, 2026
Homeమెదక్పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి ఎమ్మెల్యే సునీతారెడ్డి

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి ఎమ్మెల్యే సునీతారెడ్డి

📰 Generate e-Paper Clip

A2 న్యూస్, జూన్ 29, ప్రత్యేక ప్రతినిధి మల్పర్తి (రాoచందర్ )

నర్సాపూర్ (28) పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో పోలియో చుక్కల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి పసిపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, కౌన్సిలర్ పంబల్ల బిక్షపతి, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు మన్సూర్, సత్యం గౌడ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!