Thursday, July 30, 2026
Homeమెదక్ఆభరణాల కోసం మహిళ హత్య కేసు: నిందితుడికి జీవిత ఖైదు, 25 వేల జరిమానా

ఆభరణాల కోసం మహిళ హత్య కేసు: నిందితుడికి జీవిత ఖైదు, 25 వేల జరిమానా

📰 Generate e-Paper Clip

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్న హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

– కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (13) ఒంటరిగా సంచరించే మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆభరణాల కోసం దారుణ హత్యకు పాల్పడిన నిందితుడికి జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి వచ్చిన బుజలి అనే మహిళతో కేతావత్ గోపాల్ పరిచయం పెంచుకుని నమ్మకం కల్పించాడు. అనంతరం ఆమెను ఆటోలో శ్రీనివాస వైన్స్‌కు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి నర్సాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం సేవించిన అనంతరం, మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో ఆమెను హత్య చేసి పరారయ్యాడు. మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు 2025 మార్చి 25న నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ లింగం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మహిళతో కలిసి వెళ్లిన ఆటోను గుర్తించిన పోలీసులు, ఆటో డ్రైవర్‌ను విచారించి వారు దిగిన ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును వేగవంతం చేశారు. అప్పటి నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేసి పక్కా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ, నిందితుడు కేతావత్ గోపాల్‌పై నేరం రుజువైందని నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తులో లైజనింగ్ అధికారి ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ హరిబాబు గౌడ్ కీలకంగా సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించి సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి సీఐ జాన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్, లైజనింగ్ బృందం, దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!