Tuesday, September 15, 2026
Homeమెదక్పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి

పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి

📰 Generate e-Paper Clip

గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల కాంపౌండ్ వాల్స్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11:

మెదక్ జిల్లా (10) జిల్లాలో వి.బి.జి. రామ్ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వి.బి.జి. రామ్ పనుల పురోగతిపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న 82 గ్రామపంచాయతీ భవనాలు, 55 అంగన్వాడీ భవనాలు, 8 గోడౌన్ల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.అలాగే పూర్తయిన భవనాలను ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల కాంపౌండ్ వాల్స్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఈ పీఆర్ నర్సింలు, డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు, సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సీడీపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!