A2న్యూస్, జూలై 18, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
నర్సాపూర్ (17) హాస్టల్లో చేరిన విద్యార్థులకు వార్డెన్లు అన్ని వసతులు కల్పించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వసతి గృహ సలహా సంఘ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తారని వారు హాస్టల్లో ఉండేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. హాస్టల్ లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే విద్యార్థులకు భోజన విషయంలో కూడా ఎక్కడ రాజీ పడవద్దు అని నాణ్యమైన రుచికరమైన భోజనం విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా నర్సాపూర్ లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ , బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లేనందున అందుకుఅవసరమైనటువంటి చర్యలు తీసుకొని ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు చదువు పరంగా కానీ భోజనం పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అంతే కాకుండా వార్డెన్లకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, ఎంపీడీవో ఉమారాణి, ఎంఈఓ తారా సింగ్, శేషచారి, గంగ కిషన్ పద్మజ, అమర జ్యోతి ఆయా హాస్టల్ వార్డెన్ లు పాల్గొన్నారు.

