Friday, October 30, 2026
Homeమెదక్మెదక్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్‌డీఓ సమావేశం

మెదక్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్‌డీఓ సమావేశం

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 30 :

మెదక్: మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో 34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి డాక్టర్ కె. రామాదేవి ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా (ఎస్‌ఐఆర్) కార్యక్రమం గడువును నవంబర్ 26 వరకు పొడిగించినట్లు, తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30న ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 387 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఫారం-6, 6A, 7, 8 దరఖాస్తుల పురోగతిని వివరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్‌డీఓ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!