Sunday, September 13, 2026
Homeమెదక్నవరాత్రి ఉత్సవాల నిర్వాహకుల సన్నాహక సమావేశం

నవరాత్రి ఉత్సవాల నిర్వాహకుల సన్నాహక సమావేశం

📰 Generate e-Paper Clip

A2న్యూస్,తూప్రాన్ ప్రతినిధి (పెద్దింటి సత్యం) సెప్టెంబర్ 10:

తూప్రాన్ (9) వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తూప్రాన్ పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్స్‌లో వినాయక ఉత్సవాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తూప్రాన్ సర్కిల్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్,శివ్వంపేట్, వెల్దుర్తి, మండలాలకు చెందిన వినాయక ఉత్సవాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, వినాయక ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఊరేగింపుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్,ఆర్డివో జయచంద్రారెడ్డి,తూప్రాన్ ఎస్‌ఐ వి. గంగరాజు, శివ్వంపేట్ ఎస్‌ఐ మధుకర్ రెడ్డి,వెల్దుర్తి ఎస్‌ఐ కర్నాకర్ రెడ్డి,తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ విద్యుత్ శాఖ ఏఈ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో మరియు పరస్పర సహకారంతో నిర్వహించుకోవాలని, పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని అధికారులు సూచించారు. అలాగే ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా మండపాలు మరియు ఊరేగింపులు నిర్వహించాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!