A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 16:
మనోహరాబాద్ (16) తూప్రాన్ పిఎసిఎస్ డైరెక్టర్ లుగా మనోహరాబాద్ మండలం నుండి ఎన్నికైన దండుపల్లికి చెందిన మరాటి దుర్గమ్మ, కోనాయపల్లికి చెందిన మన్నె ధర్మేందర్, కాళ్లకల్ కు చెందిన ఎరుకలి నరసింహ, కాళ్లకల్ కు చెందిన దండుసత్యనారాయణ లు ఎన్నిక కాగా, తూప్రాన్ లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు చిటుకుల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, కాళ్లకల్ నుండి ర్యాలీగా బయలుదేరారు.
దారి మధ్యలో,దండుపల్లి గ్రామ సర్పంచ్, మరాటి నాగరాజు ఆధ్వర్యంలో దండుపల్లి గ్రామంలోఅంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా బయలుదేరారు. ఇట్టి కార్యక్రమంలో, కళ్ళకల్ సర్పంచ్ నవ్యనాగరాజు, కొండాపూర్ సర్పంచి రాము, దండుపల్లి సర్పంచి నాగరాజు, కూచారం సర్పంచ్ చిత్రా రఘు మనోహరాబాద్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి. పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

