A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 2:
మెదక్ జిల్లా (1) ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న పర్స బైరయ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సి ఎం ఆర్ ఎఫ్) నుంచి 4 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చొరవతో ప్రభుత్వానికి చేసిన సిఫారసు మేరకు ఈ సహాయం అందింది. హైదరాబాద్ రెడ్హిల్స్లోని ఎం ఎన్ జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్లో బాధితుడికి చికిత్స అందించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్వయంగా ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్ను బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

