Thursday, July 30, 2026
Homeమెదక్మెదక్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మక్తా భూపతిపూర్ సర్పంచ్ కొమ్ము పవన్

మెదక్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మక్తా భూపతిపూర్ సర్పంచ్ కొమ్ము పవన్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జులై 7, మెదక్ ప్రతినిధి (ఆకుల యాదగిరి)

మెదక్(6)మెదక్ మండలంలోని మక్తా భూపతిపూర్ గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొమ్ము పవన్ సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి పంచాయతీ భవనం అత్యవసరమని, ప్రత్యేక నిధులు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించాలని సర్పంచ్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ కొమ్ము పవన్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు మక్తా భూపతిపూర్ గ్రామ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము పవన్‌తో పాటు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఆదిల్ పాషా, మల్లన్నకాడి తండా సర్పంచ్ బన్సీలాల్, పరమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!