అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధే లక్ష్యం
పేదలకు సంక్షేమ పథకాలు.. నియోజకవర్గానికి భారీగా అభివృద్ధి నిధులు
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22:
మెదక్ జిల్లా (21)మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమైన పత్రమని, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ఇది ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో పలువురు అర్హులైన పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన కుటుంబాలను గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులు అందించే ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.
అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యత
మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు.
అభివృద్ధి.. సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత
ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

