Monday, October 19, 2026
Homeమెదక్పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ...

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

📰 Generate e-Paper Clip

కౌడిపల్లి: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంతో పాటు, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సేకరించాలని, కోర్టుల్లో కేసుల నిరూపణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. దొంగతనాల నియంత్రణకు అనుమానితులపై నిఘా పెంచి, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. గ్రామస్థాయిలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో సమన్వయం పెంచుకోవాలని, స్థానిక సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పండుగల సందర్భంగా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, విధులను క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని తెలిపారు. డయల్ 112కు వచ్చే అత్యవసర కాల్స్‌పై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర పోలీస్ సహాయం అందించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంపొందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, ఎస్‌ఐ అమర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!