పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కౌడిపల్లి పోలీస్ స్టేషన్ను వార్షికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
కౌడిపల్లి: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంతో పాటు, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సేకరించాలని, కోర్టుల్లో కేసుల నిరూపణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల...