A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 6:
మెదక్ జిల్లా (5) ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 79 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో భూభారతికి 24, ఇందిరమ్మ ఇళ్లకు 15, పెన్షన్లకు 3, ఇతర సమస్యలకు 37 దరఖాస్తులు ఉన్నాయి. సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో యూనస్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

