A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 19:
నర్సాపూర్ (18) పేద బిడ్డల పెళ్లిలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల తులం బంగారంఅడుగుతున్నందుకే పూర్తిగా కళ్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్ర చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన మాజీ సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్ 2నఈపథకాలనుప్రారంభించారని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఇది తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ఈ రెండు పథకాలను రద్దు రద్దు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్లమీదకు వచ్చి ఎక్కడికిఆక్కడే మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

