పథకాలను ఎత్తివేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 19: నర్సాపూర్ (18) పేద బిడ్డల పెళ్లిలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల తులం బంగారంఅడుగుతున్నందుకే పూర్తిగా కళ్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్ర చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన...