Tuesday, September 15, 2026
Homeమెదక్పి.డి.ఎస్. సన్న బియ్యం పంపిణీ గడువు పొడిగింపు

పి.డి.ఎస్. సన్న బియ్యం పంపిణీ గడువు పొడిగింపు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ 5 వరకు అవకాశం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1:

మెదక్ జిల్లా ( 31) జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పి.డి.ఎస్.) ద్వారా సన్న బియ్యం పంపిణీ గడువును సెప్టెంబర్ 5, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి (డి సి ఎస్ వో) తెలిపారు. కమిషనర్, పౌర సరఫరాల శాఖ, తెలంగాణ, హైదరాబాద్ ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు ఈ అదనపు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు పి.డి.ఎస్. సన్న బియ్యం పొందని రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సంబంధిత చౌక ధరల దుకాణం (ఎఫ్‌పీ షాప్)ను సంప్రదించి, తమకు కేటాయించిన సన్న బియ్యాన్ని సెప్టెంబర్ 5లోపు తప్పనిసరిగా పొందాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాల డీలర్లు నిర్ణీత సమయాల్లో దుకాణాలను తెరిచి ఉంచి, అర్హత కలిగిన రేషన్ కార్డుదారులందరికీ 100 శాతం సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశించారు. బియ్యం పంపిణీలో నిర్లక్ష్యం వహించినా, నిర్ణీత సమయానికి దుకాణాలను తెరవకపోయినా లేదా లబ్ధిదారులకు బియ్యం అందించకుండా ఇబ్బందులకు గురిచేసినా సంబంధిత డీలర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!