Monday, October 19, 2026
Homeమెదక్నర్సాపూర్ లో ఘనంగా బతుకమ్మ పండుగ

నర్సాపూర్ లో ఘనంగా బతుకమ్మ పండుగ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 19 :

నర్సాపూర్ (18) డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి మహిళలు తమ వాకిళ్లను కల్లాపితో అందమైన రంగవల్లులతో ముస్తాబు చేసి రకరకాల పూలతో చూడచక్కని బతుకమ్మలను పేర్చడంలో నిమగ్నం అవ్వడం కనిపించింది. సాయంత్రం తమ బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో బతుకమ్మ ఆడి స్థానిక రాయరావు చెరువులో నిమజ్జనం చేశారు. అక్కడ ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటూ పండగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా స్థానిక రాయలచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, కమీషనర్ చెరుకు సాయికుమార్ లు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి స్వయంగా చూసుకున్నారు. నిమజ్జనానికి వచ్చేమహిళలకు ఎలాంటిఇబ్బందులుకలగకుండా తమ సిబ్బందితో గత నాలుగు రోజుల నుండి అక్కడ ఉన్న పరిసరాలు అన్ని శుభ్రం చేసి అన్ని ఏర్పాట్లను చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!