నర్సాపూర్ లో ఘనంగా బతుకమ్మ పండుగ
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 19 : నర్సాపూర్ (18) డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి మహిళలు తమ వాకిళ్లను కల్లాపితో అందమైన రంగవల్లులతో ముస్తాబు చేసి రకరకాల పూలతో చూడచక్కని బతుకమ్మలను పేర్చడంలో నిమగ్నం అవ్వడం కనిపించింది. సాయంత్రం తమ బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో బతుకమ్మ ఆడి స్థానిక రాయరావు చెరువులో నిమజ్జనం చేశారు. అక్కడ ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటూ పండగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా స్థానిక...