Monday, September 14, 2026
Homeమెదక్నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఆగస్టు 31లోగా దరఖాస్తుల సమర్పణ | సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 22:

మెదక్ జిల్లా( 21)నూతన చేయూత పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. నూతన చేయూత పింఛన్ల దరఖాస్తులను మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యలు ఎదురైన లబ్ధిదారులు 8008556112 నంబర్‌లోని చేయూత పింఛన్ల హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.

దివ్యాంగులకు ప్రత్యేక యూడీఐడీ శిబిరం

(యూడీఐడీ ) ధ్రువీకరణ పత్రం లేని దివ్యాంగుల కోసం ఈ నెల 26వ తేదీన మెదక్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ( జి జీ హెచ్)లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూడీఐడీ కోసం దివ్యాంగులు ముందుగా మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ ప్రత్యేక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుల వద్ద అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా లేకపోతే సంబంధిత అధికారులను సంప్రదించి వెంటనే వాటిని పొందేలా జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రాల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ద్వారా సహాయం పొందవచ్చన్నారు.

దరఖాస్తులను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

అర్హులైన ప్రతి ఒక్కరూ నూతన చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. లబ్ధిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత ఎంపీడీఓలను ఆదేశించారు. నూతన చేయూత పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియలో లబ్ధిదారులకు జిల్లా యంత్రాంగం సహాయకారిగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!