Monday, September 14, 2026
Homeమెదక్ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌లో కొలువుల భర్తీకి దరఖాస్తులు!

ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌లో కొలువుల భర్తీకి దరఖాస్తులు!

📰 Generate e-Paper Clip

హెచ్‌ఎం, ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం.. సెప్టెంబర్‌ 2 వరకు గడువు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 29 :

మెదక్ (28) మెదక్ జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (.ఎఫ్ ఎల్ ఎన్) కార్యక్రమం అమలుకు ఏర్పాటు చేస్తున్న ఎఫ్ ఎల్ ఎన్  సెల్‌లో పోస్టుల భర్తీకి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెడ్‌మాస్టర్, తెలుగు, ఇంగ్లిష్, గణిత సబ్జెక్టులకు సంబంధించి మూడు ఎస్ జి టి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎల్ ఎఫ్ ఎల్ హెచ్‌ఎం పోస్టుకు కనీసం రెండేళ్ల హెడ్‌మాస్టర్ అనుభవం, ఎఫ్ ఎల్ ఎన్ పై అవగాహన, నాయకత్వం, కమ్యూనికేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.ఎస్ జి టి పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో ప్రావీణ్యంతో పాటు కనీసం ఐదేళ్ల బోధనా అనుభవం,. ఎఫ్ ఎల్ ఎన్ బోధనా విధానాలపై అవగాహన అవసరం. అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 56 ఏళ్లకు మించకూడదు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల ప్రతులతో  డి ఈ ఓ కార్యాలయం, ఇన్వర్డ్ సెక్షన్, మెదక్లో సమర్పించాలి. సెప్టెంబర్ 3న ఇంటర్వ్యూ, తుది ఎంపిక నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!