Wednesday, October 14, 2026
Homeమెదక్ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు

ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 4:

నర్సాపూర్ (3)  ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కళ్లెదుట గోదావరి నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ల సమక్షంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సందర్భంగా హరీష్ రావు వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా బొగ్గు నిల్వ చేసుకోకుండాఇప్పుడు కరెంటు కోతలను ఎల్‌నినో మీద నెట్టేసి ప్రజల ఉసురు పోసుకుంటున్నాడని మండిపడ్డారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన ఘరానా మోసగాడు రేవంత్ రెడ్డి అనివిమర్శించారు. పరిపాలన పేరిట కరెంటు కోసం సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు, ఎరువుల కోసం లైన్లు పాత రోజులు తెస్తానన్న రేవంత్ మళ్లీ అదే దరిద్రాన్ని తెచ్చాడని అన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఊరూరు తిరిగారని వంద రోజులు పోయి వెయ్యి రోజులు దాటుతున్నా ఆ బాండ్ పేపర్లకు దిక్కులేదని బాండ్ పేపర్ కు ఉండే ఇజ్జత్ కూడా కాంగ్రెస్ వాళ్లు తీసేశారని వాపోయారు. కరెంటు కోతలకు ఎల్ నినో కారణమని కాంగ్రెస్ కుంటిసాకులు చెబుతోందని ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కోతని మండిపడ్డారు.శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా కల్వకుర్తి మోటార్లను 8 గంటలే నడుపుతున్నారు. సమ్మక్క బ్యారేజీలో నీళ్లున్నా దేవాదుల మోటార్లను 8 గంటలే నడుపుతున్నారని కళ్ల ముంగట నీళ్లున్నా ఎత్తకపోతే ఇది కాలం తెచ్చిన కరువు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, శేఖర్, నాయకులు మన్సూర్, సత్యం, బిక్షపతి బాల్ రెడ్డి, బాబ్యనాయక్, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!