A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 2:
మెదక్ జిల్లా (1)పట్టణ అభివృద్ధి పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించేలా ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహాల ఏర్పాటుతో పాటు పరిసరాల అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు. మెదక్‌తో పాటు రామాయంపేట ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. “అభివృద్ధి కాగితాలపై కాదు.. ప్రతి రోడ్డులో, ప్రతి కూడలిలో కనిపించాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మెదక్‌ను ఆధునిక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే వరకు అభివృద్ధి ప్రయాణం ఆగదు” అని ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు.

