Tuesday, October 13, 2026
Homeమెదక్ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలకు దరఖాస్తుల ఆహ్వానం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 1:

మెదక్ జిల్లా (30) మెదక్: ఖరీఫ్‌ 2026–27 ధాన్యం కొనుగోలు సీజన్‌ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (పిపిసిఎస్) సన్న రకం ధాన్యాన్ని గుర్తించి, ధృవీకరించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాలు వెల్లడించారు. సన్న రకం ధాన్యం గుర్తింపు, ధృవీకరణ కోసం బి. ఎస్. సి. అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌లో డిప్లొమా, డిప్లొమా ఇన్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, బి. ఎస్ సి. బాటనీ, బి జెడ్ సి తదితర అర్హతలు కలిగిన వ్యక్తుల సేవలు రెండు నెలల కాలానికి అవసరమున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య, అభ్యర్థుల అర్హతలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన వ్యక్తుల సేవలను వినియోగించుకునే విషయంలో జిల్లా స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవ వివరాలతో మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!