Tuesday, October 13, 2026
Homeమెదక్బీవీఆర్‌ఐటీలో అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫెయిర్

బీవీఆర్‌ఐటీలో అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫెయిర్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 1:

నర్సాపూర్ (30)  బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) లో జెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సహకారంతో గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇంటరాక్షన్ అండ్ యూనివర్సిటీ ఫెయిర్ ను బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నేరుగా కళాశాలకు వచ్చి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటం గర్వకారణమన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, అందుబాటులో ఉన్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో అమెరికా, బ్రిటన్‌కు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, జార్జ్ మేసన్ యూనివర్సిటీ, కొలరాడో స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్లోని విద్యా కార్యక్రమాలు, ప్రవేశ విధానాలు, విద్యా వాతావరణం, పరిశోధన మరియు కెరీర్ అవకాశాలపై విద్యార్థులకువివరించారు.విదేశీ విద్యకు సంబంధించిన అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, పరిశోధనా అవకాశాలు, కెరీర్ అవకాశాలు, జీఆర్‌ఈ , ఐఈఎల్‌టీఎస్ , స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, లెటర్‌ ఆఫ్‌ రికమెండేషన్‌, ఫండింగ్, వీసా ప్రక్రియ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యూనివర్సిటీ ప్రతినిధులతో నేరుగా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజర్ బి. బాపి రాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టి.ఎల్.ఎన్. సురేష్ అన్ని విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!