బీవీఆర్‌ఐటీలో అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫెయిర్
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 1: నర్సాపూర్ (30) బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) లో జెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సహకారంతో గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇంటరాక్షన్ అండ్ యూనివర్సిటీ ఫెయిర్ ను బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నేరుగా కళాశాలకు వచ్చి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటం గర్వకారణమన్నారు....