Thursday, October 15, 2026
Homeమెదక్సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ

సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 29:

శివంపేట(28) మండలంలోని సికింద్లాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ శర్మ కధనం ప్రకారం. ఆదివారం ఎప్పటిలాగే యధావిధిగా స్వామివారికి పూజలు నిర్వహించి తాళం వేసి వెళ్లినట్లు తెలిపారు. వాచ్ మెన్ కార్యాలయంలో నిద్రించి తెల్లారి లేచి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనలో అమ్మవారి పుస్తెలతాడు స్వామివారి వెండి ఆభరణాలు సుమారు 4.5 కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు తెలిపారు. వెంటనే శివంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని తూప్రాన్ సిఐ వెంకటరాజా గౌడ్ పరిశీలించినట్లు తెలిపారు. శివంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!