మెదక్ టౌన్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27:
మెదక్ జిల్లా (26) మెదక్ టౌన్‌లో గణపతి నిమజ్జన కార్యక్రమాలు పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలీసు శాఖ సమన్వయంతో చేపట్టిన చర్యల ఫలితంగా గణపతి నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయి. నిమజ్జన ప్రక్రియను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా పూర్తి చేయడంలో సమన్వయంతో పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహించిన సిబ్బంది సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

