Tuesday, September 22, 2026
Homeమెదక్చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి

చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

హోళియదాసరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శాఖమూరి యాదగిరి 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 22:

నర్సాపూర్ (21) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ను హామీలు అమలు చేయాలనిహోళియదాసరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శాఖమూరి యాదగిరి హోలియదాసరి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ   ఎస్సీ 57 ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎం.బీ.ఎస్.సి57 ఉప కులాల వారికి ఇవ్వాలని, 57 ఉప కులాల వారికి ఆర్డీవో ద్వారా ఇస్తున్న కులపత్రాలు స్థానిక తహసీల్దార్ ల ద్వారానే కుల ధ్రువపత్రాలు మంజూరు చేయాలని, వర్గీకరణ లోని రోస్టర్ పాయింట్లను సవరించి గ్రూప్ – I, గ్రూప్ – III లో ఉన్న వారికి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 15 % రిజర్వేషన్లు లను 22 % శాతం వరకు పెంచాలని, అన్ని ప్రైవేటు రంగ సంస్థలలో కూడా రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!