A2న్యూస్ నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి సెప్టెంబర్ 18:
కొల్చారం (17) మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ శ్రీనివాస్ చారి, మండల అభివృద్ధి కార్యాలయం వద్ద అభివృద్ధి అధికారి ఉన్నసా బేగం ఆయా కార్యాలయం వద్ద ఆయాఅధికారులు, పిఎసిఎస్ ల వద్ద చైర్మన్లు, గ్రామ పంచాయతీల గ్రామ సర్పంచ్లు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ చారిమాట్లాడుతూ. భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకొనసాగిందని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ చారి తెలిపారు. నిజాం పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్వేచ్ఛ కోసం ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు.ప్రజల ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్నినిర్వహిస్తున్నా మని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

