A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 16:
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో బయో లిక్విడ్ గ్రామంలోని వీధులు ప్రధాన వీధులలో బురద నీటి గుంతలు వద్ద పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దేవన్న గారి శేఖర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాగే ఈ పికారీ చేయించడం వల్ల దోమల నివారణ పూర్తిగా అవుతుందని గ్రామ వ్యాప్తంగా దోమల యొక్క లార్వా చనిపోయి దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సుభిక్షంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ ప్రభాకర్ వార్డు సభ్యులు పంచాయతీ కార్మిక సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

