డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 8:
నర్సాపూర్ (7 )ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వికాస యాత్రనుచేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఏమీ జరగలేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను హరీష్ రావు నర్సాపూర్ నుండి తరలించారనిమండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేసిన ద్రోహం ఎవరు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని, కుల వృత్తుల పేరిట మభ్య పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ గుప్తా, సురేష్ నాయక్, రాజేష్, ఉదయ్ కుమార్ శివ కుమార్, ఆంజనేయులు గౌడ్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

