Monday, September 14, 2026
Homeమెదక్టాస్‌ఎస్‌ ఓపెన్‌ .ఎస్ ఎస్ సి, ఇంటర్‌ ప్రవేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

టాస్‌ఎస్‌ ఓపెన్‌ .ఎస్ ఎస్ సి, ఇంటర్‌ ప్రవేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 27:

మెదక్‌ జిల్లా (26) తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టోస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ SSC, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ బుధవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి రాజు, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మురళీమోహన్‌, విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌ రాజు, మెదక్‌ జిల్లా TOSS కోఆర్డినేటర్‌ ఎ. వరప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ చదువును మధ్యలోనే మానేసిన 14 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు, యువతీ యువకులకు ఓపెన్‌ స్కూల్‌ విద్య చక్కటి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే ఆసక్తి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుకు దూరమైన వారు తమ విద్యను కొనసాగించి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!