Monday, September 14, 2026
Homeమెదక్యూరియా కోసం హైవేపై రైతుల ఆందోళన

యూరియా కోసం హైవేపై రైతుల ఆందోళన

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) ఆగస్టు 21:

మనోహరాబాద్ (20) మండల కేంద్రంలోని హైవే–44పై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. యూరియా బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్‌లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాప్‌ల పేరుతో తమకు యూరియా అందకుండా చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన మేరకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవేపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో హైవే–44పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూరియా కొరత, బుకింగ్ యాప్‌ల సమస్యలను పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!