యూరియా కోసం హైవేపై రైతుల ఆందోళన

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) ఆగస్టు 21: మనోహరాబాద్ (20) మండల కేంద్రంలోని హైవే–44పై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. యూరియా బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్‌లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాప్‌ల పేరుతో తమకు యూరియా అందకుండా చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన మేరకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవేపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో హైవే–44పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి...