Friday, August 14, 2026
Homeమెదక్స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

– మెదక్ ఆర్డీవో రమాదేవి

A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (13)ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్‌లోని పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌ను సందర్శించిన ఆర్డీవో.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలు నిర్వహించనున్న ప్రదేశంలో వేదిక, పరేడ్‌, విద్యుత్‌ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రమాదేవి సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు, పోలీస్‌ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!