Saturday, August 8, 2026
Homeమెదక్విద్యుత్ షాక్ తో యువకుడు మృతి...మరో ఇద్దరికి గాయాలు

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి…మరో ఇద్దరికి గాయాలు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:

నర్సాపూర్ (7) విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోతెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన మల్పర్తి హర్షవర్ధన్ (19), బోడ నిఖిల్ బోనాల పండుగ లో భాగంగా శివాలయం వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి హర్షవర్ధన్ మృతి చెందాడు. అక్కడే ఉన్న నిఖిల్, ఇర్ఫాన్ లు కాపాడే ప్రయత్నం చేయగా వారికి కూడా కరెంట్ షాక్ తగిలింది. గాయపడ్డ నిఖిల్, ఇర్ఫాన్లను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన హర్షవర్ధన్ ను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!