అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 4:
మెదక్ (3) మెదక్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధులు నందన, టూరిజం శాఖ డీఈ శ్రీశైలం, ఈడీఎం సందీప్, డీపీఆర్వో రామచంద్ర రాజు తదితర అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధులు, టూరిజం శాఖ అధికారులు మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఎన్నో పర్యాటక ప్రాంతాలు మెదక్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మెదక్‌ను టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

