A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట(27) చేగుంట గ్రామానికి చెందిన కర్నే మంజుల (30), భర్త లచ్చయ్య, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో గ్రామ శివారులోని తమ పొలం వద్దకు వెళ్లేందుకు జాతీయ రహదారి ఎన్‌హెచ్–44 దాటుతుండగా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మంజుల అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త కర్నే లచ్చయ్య తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

