A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 6:01 am Posted by : A2TV NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చేగుంట(27) చేగుంట గ్రామానికి చెందిన కర్నే మంజుల (30), భర్త లచ్చయ్య, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో గ్రామ శివారులోని తమ పొలం వద్దకు వెళ్లేందుకు జాతీయ రహదారి ఎన్‌హెచ్–44 దాటుతుండగా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మంజుల అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త కర్నే లచ్చయ్య తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.