నర్సాపూర్ ఆర్డీవోకు ప్రజాసంఘాల వినతి
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 30 :
దళితుల పై జరుగుతున్న దాడులను అరికట్టడానికి పౌర హక్కుల దినోత్సవం జరపాలని నర్సాపూర్ ఆర్టీవో కు ప్రజాసంఘాల నాయకులు విన్నవించారు. శుక్రవారం నాడు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్, మాల కోఆర్డినేషన్ ఫోరం మెదక్ జిల్లా ఇంచార్జ్ కల్లూరి సంజీవ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, ఎం సి ఎఫ్ జిల్లా నాయకులు శివ, నరేందర్ లు నర్సాపూర్ ఆర్డిఓ రామకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ డివిజన్ శివంపేట మండలం నవాబుపేట గ్రామంలో బతుకమ్మ పండుగ నాడు దళితులపై దాడులు చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. జిల్లాలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు జస్టిస్ పున్నయ్య సిఫారసు ప్రకారం ప్రతినెల చివరన ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిపి చట్టాలు కుల వివక్ష తదితర అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు. కుల, మత భేదాలు పాటించకుండా ప్రజలందరూ సోదరుభావంతో కలిసిమెలిసి జీవించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ పౌర హక్కుల దినోత్సవం నామమాత్రంగా జరపకుండా ప్రణాళిక బద్ధంగా ప్రజలందరూ పాల్గొనే విధంగా జరపాలని విధిగా మండల తాహ సిల్దార్, ఎస్సైలు విధిగా పాల్గొనే విధంగా ఆదేశాలను జారీ చేయాలని కోరారు.

