Monday, September 14, 2026
Homeమెదక్.వి.ఆర్.ఐ.టి నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో జాతీయ స్థాయికి 50 జట్లు ఎంపిక

.వి.ఆర్.ఐ.టి నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో జాతీయ స్థాయికి 50 జట్లు ఎంపిక

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 11:

నర్సాపూర్ (10) బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన రెండు రోజుల స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2026 పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. సెప్టెంబరు 9, 10 తేదీల్లో కళాశాలలోని ఇఎల్ఎన్ బ్లాక్ సెమినార్ హాల్‌లో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే, మేనేజర్ బాపిరాజు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించగా మొత్తం 360 జట్లు పాల్గొన్నాయి. వీటిలో 74 హార్డ్‌వేర్, 286 సాఫ్ట్‌వేర్ జట్లు ఉన్నాయి. సివిల్, ఈసీఈ, సీఎస్ఈ, ఈఈఈ, మెకానికల్, ఐటీ, ఏఐఎంఎల్ తదితర విభాగాలకు చెందిన 2,160 మంది విద్యార్థులు, వీరిలో 729 మంది విద్యార్థినులు, తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించారు.స్మార్ట్ ఆటోమేషన్, గ్రీన్ టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, వ్యవసాయం తదితర రంగాల్లోని సామాజిక సమస్యలకు విద్యార్థులు వినూత్న సాంకేతిక పరిష్కారాలనురూపొందించి ప్రదర్శించారు. జ్యూరీ సభ్యులుసమగ్రమూల్యాంకనం అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 50 జట్లను జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2026 పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఓసీ కోఆర్డినేటర్ డాక్టర్ యు. గణేష్ నాయుడు, టి.పి.ఒ డాక్టర్ జె. బంగార్రాజు, విద్యార్థి కోఆర్డినేటర్లు డి. లిఖిల్, ఎం. అచా సా గిడియాన్, కె. హిరణ్మయి, సిహెచ్. ఆశ్రిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం,అధ్యాపకులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!