.వి.ఆర్.ఐ.టి నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో జాతీయ స్థాయికి 50 జట్లు ఎంపిక

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 11: నర్సాపూర్ (10) బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన రెండు రోజుల స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2026 పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. సెప్టెంబరు 9, 10 తేదీల్లో కళాశాలలోని ఇఎల్ఎన్ బ్లాక్ సెమినార్ హాల్‌లో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే, మేనేజర్ బాపిరాజు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించగా మొత్తం 360 జట్లు పాల్గొన్నాయి. వీటిలో 74 హార్డ్‌వేర్, 286 సాఫ్ట్‌వేర్ జట్లు...