Monday, September 14, 2026
Homeమెదక్జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: న్యాయమూర్తి ఎం. హేమలత

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: న్యాయమూర్తి ఎం. హేమలత

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 23:

నర్సాపూర్ (22) సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ న్యాయమూర్తి ఎం. హేమలత సూచించారు. పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హేమలత మాట్లాడుతూ  జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు, నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 వ తారీకు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేయదగ్గ కేసులలో రాజీ కుదుర్చుకోవడానికి కక్షిదారులు సెప్టెంబర్ 12 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులు రాజీ కుదుర్చుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వర పరిష్కరించుకోవడం కోసం నర్సాపూర్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కక్షిదారులకు సంపూర్ణ సహకారాలు అందించి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంగా కృష్ణ, నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి, చిలప్ చెడ్ ఎస్సై నర్సింలు, నర్సాపూర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రావు, కౌడిపల్లి డబ్ల్యు ఏ ఎస్ ఐ అండాలు, పోలీస్ కోర్టు కానిస్టేబుల్స్, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!