Tuesday, September 15, 2026
Homeమెదక్ఎస్సై ఆధ్వర్యంలోవినాయక నవరాత్రి ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం ... పాల్గొన్న మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్...

ఎస్సై ఆధ్వర్యంలోవినాయక నవరాత్రి ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం … పాల్గొన్న మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ రూరల్ సీఐ కృష్ణమూర్తి

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 10 :

 

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎస్సై మొయినుద్దీన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, రూరల్ సీఐ  కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎస్సైమొహినుద్దీన్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తుశ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అనుమతి లేని కార్యక్రమాలకు పాల్పడవద్దని సూచించారు.  అనంతరం రూరల్ సీఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ…ప్రభుత్వ నిబంధన మేరకు  ప్రతి ఒక్కరూ వినాయక మండపాలలో రాత్రి వేళల్లో ఐదు మంది కమిటీ సభ్యులు  మేల్కొని ఉండాల్సిన అవసరం ఉందని షెడ్డు కు సంబంధించి మంచి టాపర్లను కోతులు చించి వేయకుండా చూడాలని విపరీతమైన కోతులు పెరగడంతో కోతులు షెడ్లోకి వెళ్లి వినాయక ధ్వంసం కావచ్చు లడ్డు ఎత్తుకెళ్లడం కావచ్చు పలు సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయని వీటివల్ల అనవసరమైన లేనిపోని గిట్టని వారు కావాలనే చేశారని ఉద్దేశాలు వస్తాయని ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పాటించి ప్రజలకు పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. డీజే లకు ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టినటువంటి” ఆగమన్”అమల్లో ఉంటుందని డీజే లు పెట్టడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు మృత్యుభారిన పడే అవకాశాలు ఉన్నాయని మామూలు సౌండ్ బాక్స్ లో వినియోగించాలని లేని ఏడల చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. అలాగే రాత్రి వేళల్లో స్థానిక పోలీసులు కాకుండా ప్రత్యేక టీములు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతారని వినాయక మండపాల వద్ద ఎలాంటి అనుమతులు లేని కార్యక్రమాల పాలు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిఎస్పి ప్రసన్న కుమార్, రూరల్ సిఐ కృష్ణమూర్తి లను కాలువాలతో స్థానిక సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు యువజన సంఘాల వారు పలు పార్టీల ప్రజాప్రతినిధులు సిబ్బంది మహేష్ ,రాజు ,ఏఎస్ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచారం ఇచ్చిన వెంటనేశాంతి కమిటీ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతకు ప్రజాప్రతి నిధులకు పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!