A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) ఆగస్టు 23:
మనోహరాబాద్ (22) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కిరాణా, ఫాస్ట్ఫుడ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున షాపులో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి దుకాణ యజమాని వర్గంటి నాగేష్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించగా, షాపులోని కిరాణా సరుకులు, ఫాస్ట్ఫుడ్ సామాగ్రితో పాటు ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు నాగేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత దుకాణ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు.

