A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (4) సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడిని ఓటరు జాబితాలో నమోదు చేసేలా విస్తృత అవగాహన కల్పించి, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతను తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ తహసీల్దార్ సింధు రేణుకతో పాటు సంబంధిత అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.

