A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 17:
నర్సాపూర్ (16) మండలంలోని రుస్తుంపేట గ్రామంలో విఘ్నేశ్వరునికి 51 కిలోల భారీ లడ్డును సమర్పించారు. గత 50 సంవత్సరాలుగావినాయక భజన మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు.రుస్తుంపేటగ్రామంలోనేమొట్టమొదటి వినాయకుని గా కీర్తి తెచ్చుకున్న ఈ భజన మండలి వినాయకునికి ఈ సంవత్సరం50సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో పులి రాజ్ అశోక్ కుటుంబ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాల గాను 51 కిలోల లడ్డును భజన మండలి సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇటురి శివకుమార్ రేఖ, వెంకటేశం, మూడే అచ్చయ్య, దండు శ్రీనివాస్, మోడీ ఎల్లయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మంకిడి రాములు, మంకిడి అశోక్, దండు రమేష్, మోడీ జనార్ధన్, తండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

