ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ఇన్చార్జ్ సైదులు
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 14 :
నర్సాపూర్ (13) అక్టోబర్ 7వ తారీఖున అమరావతిలో జరగబోయే ఎమ్మార్పీఎస్ మండల జాతీయ మాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ సైదులు పిలుపునిచ్చారు డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం దుర్గ దాస్ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా ఇన్చార్జి బొజ్జ సైదులు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశం మేరకు కుల, లింగ, వర్ణ మార్పు కై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 7వ తారీఖున అమరావతిలో జరగబోయే ఎమ్మార్పీఎస్ జాతీయ మాసభను విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. అనంతరం నర్సాపూర్ మండలం నూతన కమిటీ ఎన్నికల జరిగింది. అధ్యక్షులుగా మంగపూర్ రమేష్ మాదిగ,అధికార ప్రతినిధిగా మీసాల కృష్ణమాదిగ, ప్రధాన కార్యదర్శిగా తిరిసిగల్ల వేణు మాదిగ,ప్రధాన కార్యదర్శిగా కట్ల రాజు మాదిగ, ఉపాధ్యక్షులుగా బోడ శ్రీకాంత్ మాదిగ, చాగంటి శ్రీనివాస్ మాదిగ, మన్ని సత్తయ్య మాదిగ కోశాధికారిగా కిష్టని నవీన్ మాదిగ, కార్యదర్శులుగా కృష్ణ మాదిగ, అశోక్ మాదిగ బోడ వెంకటేష్ మాదిగ, జాజల బిక్షపతి మాదిగ, సహాయ కార్యదర్శులు అబ్బుగారి రాజు మాదిగ, కట నవీన్ మాదిగలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నీరుడి సత్యనారాయణ మాదిగ, కృష్ణని సాయిలు మాదిగ వెంకట్, సందీప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

