A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 13:
ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : అధికారులకు సూచన
మెదక్ జిల్లా (12) జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్ డే కార్యక్రమంలో భాగంగా మెదక్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నగేష్ శనివారం కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి, పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుతున్న సేవలు, ఓటర్ల జాబితా పరిశీలన, ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తులు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో మ్యాపింగ్ కాని కేసులు (మ్యాపింగ్ కేసులు లేవు) ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. సంబంధిత రికార్డులను అధికారులు, సిబ్బందితో కలిసి ధృవీకరించారు. ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్ డే సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు అవసరమైన సమాచారం, సహాయాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

